నాంచారమ్మ జాతర జరుపుకోవాలి

నాంచారమ్మ జాతర జరుపుకోవాలి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామంజపురం పొలాలోని ఎరుకల నాంచారమ్మ ఆలయ జాతరను ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు అన్నారు. ఆదివారం గ్రామంలో శిథిలావస్థలోని శివలింగాలను పరిశీలించి, నాంచారమ్మ దేవాలయంలో పూజ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ 800 ఏండ్ల కింద నాంచారమ్మ పంచకూటాలయాన్ని రామంజపూర్ పొలాల నిర్మించారని తెలిపారు.

 ఇప్పుడు ఆ గుడి అక్కడ నుంచి తీసేసి శిల్పాలను పడేశారని వెంటనే ఆ శిల్పాలను తీసుకువచ్చి గుడిని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు, కేతిరి రాజశేఖర్, ములుగు, జయశంకర్​భూపాలపల్లి, వరంగల్​జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.