కేసీఆర్ పై రాష్ట్రపతి, సీబీఐకి అమరవీరుల కుటుంబాల నేతలు ఫిర్యాదు

కేసీఆర్ పై రాష్ట్రపతి, సీబీఐకి అమరవీరుల కుటుంబాల నేతలు ఫిర్యాదు

ఢిల్లీ : సీబీఐ, రాష్ట్రపతిని కలిశారు తెలంగాణ అమరవీరుల కుటుంబాల నేతలు. కేసీఆర్ పాలనలో జరిగిన స్కాంలపై బుధవారం సీబీఐ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలిపారు. మియాపూర్ కుంభకోణం, నయీం కేసుల విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని..కేసులను తవ్వి, కోట్ల రుపాయలు దండుకొని నిందితులతో కేసీఆర్ లాలూచిపడ్డారన్నారు. ఇప్పటి వరకు మియాపూర్, నయీం కేసులలో ఎంతమందిని  అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నామన్నారు. వచ్చింది తెలంగాణ రాష్ట్రమా.. కల్వకుంట్ల సంస్థానమా..? ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలను వేలకోట్లతో కొనే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

రాష్ట్రంలో జరిగిన స్కాముల్లో కేసీఆర్ కుటుంబానిదే అగ్రస్థానమని..సీబీఐ చాలా సానుకూలంగా స్పందించిందన్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని చెప్పారన్నారు. తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని.. రాష్ట్రం దొరల పాలనలో ఉందని.. దానిని విడిపించాలని రాష్ట్రపతిని కోరామని తెలిపారు నేతలు. కేసీఆర్ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి చేయాలని చెప్పామన్నారు.