రేవంత్​, చంద్రబాబు భేటిలో చర్చించిన అంశాలు ఇవే..

డ్రగ్స్​ నిర్మూలనకు ఇరు రాష్ట్రాలు సమన్వయంతో..
పనిచేయాలని నిర్ణయం: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి

తెలుగుజాతి హర్షించే రోజు: ఏపీమంత్రి అనగాని సత్యప్రసాద్​

విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించేందుకు  రెండు  రాష్ట్రాల సీఎస్​ లతో  ఒక కమిటి..మంత్రులతో మరో కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.ఈ సమావేశంలో అనేక సమస్యలను చర్చించామని తెలిపారు. ఉన్నతస్థాయి కమిటిలో ఇరు రాష్ట్రాల సీఎస్​ లతో పాటు మరో ముగ్గురు అధికారులు ఉంటారని తెలిపారు.  విభజన సమస్యలు పరిష్కారానికి  రెండువారాల్లో అధికారుల స్థాయిలోని కమిటి  సమావేశం అవుతుందన్నారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై చర్చించామన్నారు. . ఇక డ్రగ్స్​ నిర్మూలనకు రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నీళ్లు,నిధుల నియామకాల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేలా ఈ రోజు సీఎంల సమావేశం జరిగిందని మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు.. విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించేదిశగా కమిటీలు సమావేశాలు జరుగుతాయన్నారు.

ఏపీమంత్రి అనగాని సత్యప్రసాద్​ మాట్లాడుతూ తెలుగుజాతి హర్షించే రోజని  అన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయన్నారు. డ్రగ్స్​ నిర్మూలను ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా మంచినిర్ణయయన్నారు. ఆంధ్రప్రదేశ్​ లో  పిల్లల స్కూళ్ల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతుందన్నారు.