ఏపీ, తెలంగాణ  మండలి చైర్మన్ల భేటీ

ఏపీ, తెలంగాణ  మండలి చైర్మన్ల భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌‌రెడ్డితో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ లోని శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో రెండు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటరీ డా. నరసింహాచార్యులు కూడా పాల్గొన్నారు. మండలి వ్యవహారాలు, నిర్వహణ తదితర అంశాలను నరసింహాచార్యులు మోషెన్‌కు వివరించారు.