తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. రెండు రోజుల్లో బంగాళాఖా తంలో అల్పపీడనం ఏర్పడ నుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారం గా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్రా, యానాం లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తా యని, ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది.
పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రా, రాయల సీమ లోనూ వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.ఇక బంగాళాఖా తంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులపాటు ( సెప్టెంబర్ 9 నుంచి) భారీ వర్షాలు కురుస్తాయని వాతావర ణశాఖ అధికారులు వెల్లడించారు.
ALSO READ | జంట జలాశయాల గేట్లు ఓపెన్
ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. అలాగే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవచ్చునని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తెలంగాణ అంతటా ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకా శం ఉండటంతో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని వాతా వరణ శాఖ అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించింది.