సీఎంల భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డిమాండ్లు ఇవే..

సీఎంల భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డిమాండ్లు ఇవే..

హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ  కొనసాగుతోంది.  విభజన అంశాలే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరుగుతోంది .ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు.  తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ పలువురు ఐఏఎస్  అధికారులు హాజరయ్యారు.   తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డిమాండ్లు ఇలా ఉన్నాయి..

 తెలంగాణ ప్రధాన డిమాండ్లు

  • పోలవరం ప్రాజెక్టులో భాగంగా.. ఏపీలో కలిసిన ఏడు తెలంగాణ మండలాలను తిరిగి ఇవ్వాలి.
  •  విద్యుత్ సంస్థ బకాయిలు 24 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి.
  • కృష్ణ జలాల్లో  558 టీఎంసీలు కేటాయించాలి
  • టీటీడీలో తెలంగాణకు వాటా ఇవ్వాలి
  • ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సీఐడీ ఆఫీస్ వంటి భవనాలు అప్పగించాలి

ఏపీ ప్రధాన డిమాండ్లు

  •  తెలంగాణ 7 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలి 
  • కృష్ణాజలాల్లో 512 టీఎంసీలు కేటాయించాలి
  • ఉద్యోగుల విభజన అంశాలు

ఎజెండాలోని అంశాలు 

  • షెడ్యూల్ 9, 10 లోని సంస్థలు, నిధులు, ఆస్తులపై చర్చ
  •  ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఆస్తులు, బిల్డింగుల పంపిణీకి సంబంధించిన అంశాలు
  • పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల పంపిణీపై చర్చ
  • రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ బకాయిలపై  వివాదం 
  • కృష్ణా జలాల్లో వాటాలు
  • సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పైనా డిస్కషన్
  •  ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సీఐడీ ఆఫీస్  భవనాలు
  • ఏపీలో విలీనమైన 7 మండలాలు
  • ఉద్యోగుల విభజన అంశాలు