![జేఈఈ మెయిన్స్‌లో తెలుగు విద్యార్ధులు ప్రతిభ](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-and-ap-students-excells-in-jee-mains_GmIivRf1ht.jpg)
జేఈఈ మెయిన్-1 ఫలితాల్లో నారాయణ హవా
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించినట్లు నారాయణ గ్రూప్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ స్టూడెంట్ బణి బ్రత మాజి 300 మార్కులకుగాను 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్ తో సత్తా చాటారని వెల్లడించారు. అలాగే..ఆయుశ్ సింఘాల్, కుషాగ్ర గుప్తా, విషద్ జైన్, షివిన్ వికాస్ లు కూడా 100 పర్సంటైల్ సాధించినట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా 14 మంది స్టూడెంట్లు 100 పర్సంటైల్ సాధిస్తే..అందులో ఐదుగురు నారాయణ విద్యార్థులేనని పేర్కొన్నారు. 8 రాష్ట్రాల్లో నారాయణ స్కూల్స్ స్టూడెంట్సే స్టేట్ టాపర్స్ గా నిలిచారన్నారు. నారాయణ అందిస్తున్న శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, పటిష్ట ప్రణాళిక, స్టడీమెటీరియల్, నిబద్ధతో కూడిన వారంతపు పరీక్షలు, ప్రత్యేకంగా రూపుదిద్ధిన ఎన్ లెర్న్ యాప్, మంచి అధ్యాపకుల వల్లే ఈ విజయం సాధించామని వెల్లడించారు. జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో సత్తా చాటిన నారాయణ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ అభినందనలు తెలియజేశారు.
జేఈఈ మెయిన్‌లో సత్తా చాటిన శ్రీచైతన్య
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థ రికార్డు సృష్టించినట్టు ఆ సంస్థ అకడమిక్ డైరెక్టర్ సుష్మ వెల్లడించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 42 మంది శ్రీచైతన్య విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినట్లు తెలిపారు. అలాగే.. మల్టిపుల్ సబ్జెక్టుల్లో ఎనిమిది మంది స్టూడెంట్స్ 100 పర్సంటైల్ సాధించారని చెప్పారు. సబ్జెక్ట్ ల్లోనూ, పర్సెంటైల్ లోనూ అత్యధికంగా 100 పర్సెంటైల్ సాధించిన ఘనత శ్రీ చైతన్యదేని వివరించారు.
విద్యార్థుల నిరంతర కృషితో పాటు అనితరసాధ్యమైన ప్రోగ్రాములు, ప్రణాళికలు, మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్, ఇన్ఫినిటీ లెర్న్ ఆన్ లైన్ యాప్, టాప్ ఫ్యాకల్టీ శిక్షణ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్‌లో ఎస్ఆర్ ప్రతిభ
హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచినట్లు ఆ సంస్థ చైర్మన్ వరదారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ స్టూడెంట్లు వల్లాల నాగ సిద్దార్థ 99.97 శాతం, తాడిపత్రి తేజస్ ఉద్బవ్ రెడ్డి 99.83, మారం రాజ వర్షిత్ రెడ్డి 99.81, దిడ్డి ప్రజ్వల్ కుమార్ 99.77, యాద భరణి శంకర్ 99.77, చల్లా అన్సికా 99.66, మేడ కార్తీక్ 99.66, జోగు అభిరామ్ 99.60, కడారి సంజయ్ 99.58, చిన్ని కమలవర్దన్ 99.58 పర్సంటైల్ సాధించినట్లు వివరించారు.
ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన 25 మంది విద్యార్థులు 99శాతం పర్సంటెల్ సాధించినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమ మార్కులను ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్ధులు సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోశ్ రెడ్డి అభినందించారు.
జేఈఈ మెయిన్‌లో అల్ఫోర్స్ విద్యార్థుల విజయం
కరీంనగర్, వెలుగు: జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు ఆ సంస్థ అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. కరీంనగర్ సిటీలోని వావిలాలపల్లి టైనీ టాట్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమ సంస్థకు చెందిన అనిరుధ్ సాయి 99.90 పర్సంటైల్, వమిక 99.88, అంకిత్ సాయి 99.81, సాయి సుముఖ 99.69, విశాల్ 99.61, రిషికేశ్ 99.53, రామ సుమిత్ 99.51, అబ్దుల్ హక్ 99.48, అబ్దుల్ జిషన్ 99.41, శశి ప్రీతం 99.38, కార్తీక్ రెడ్డి 99.09 పర్సంటైల్ సాధించారని నరేందర్ రెడ్డి వివరించారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందించే ప్రత్యేక శిక్షణ, సీనియర్ అధ్యాపకుల మార్గదర్శకత్వం, అభ్యాసం ద్వారా మాత్రమే ఈ అద్భుత ఫలితాలు సాధించగలిగినట్లు ఆయన పేర్కొన్నారు. తమ విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.