సికింద్రాబాద్, వెలుగు: టెక్నికల్సమస్యల కారణంగా సికింద్రాబాద్నుంచి ఢిల్లీకి వెళ్లే రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆదివారం ఉదయం 6 గంటలకు బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఉదయం 9.30కు బయలుదేరుతుందని చెప్పారు.
సికింద్రాబాద్, హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ల మధ్య నడిచే దురంతో ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12.50కు బయలుదేరాల్సి ఉండగా, ఆదివారం సాయంత్రం 4.20కు స్టార్ట్ అవుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.