- రూ.7.5 కోట్లు విలువ చేసే ఆస్తులను కోర్టులో డిపాజిట్ చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితుల ఆస్తులను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) అధికారులు ఫ్రీజ్ చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించడం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి కోర్టులో డిపాజిట్ చేస్తున్నారు. ఈ ఏడాది నమోదైన మూడు కేసుల్లో ఫ్రీజ్ చేసిన ఆస్తుల వివరాలను టీజీన్యాబ్ డీజీ సందీప్ శాండిల్యా శుక్రవారం వెల్లడించారు.
ఈ ఏడాది జూన్ 18న గుమ్మడిదలలో అరెస్ట్ చేసిన అంజిరెడ్డి అల్ఫాజోలం కేసులో రూ.కోటి విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశామని తెలిపారు. రాజేంద్రనగర్‌లో జనవరి 18న అరెస్ట్ చేసిన సమీర్ హాస్పిటల్ డాక్టర్ ముస్తఫా ఖాన్‌కు చెందిన రూ.2 కోట్లు విలువ చేసే ఆస్తులు, 2021 మార్చి 14 అరెస్టయిన ఎం.మద్దురి రామకృష్ణ (ఏఆర్ కానిస్టేబుల్)కు చెందిన రూ.4.5 కోట్లు విలువైన బ్యాంకు బ్యాలెన్స్, స్థిరాస్తుల్ని ఫ్రీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.