డ్రగ్స్​కు అలవాటు పడితే జీవితం నాశనం  :టీజీ న్యాబ్​ డైరెక్టర్ సందీప శాండిల్య

డ్రగ్స్​కు అలవాటు పడితే జీవితం నాశనం  :టీజీ న్యాబ్​ డైరెక్టర్ సందీప శాండిల్య

మెహిదీపట్నం, వెలుగు: డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. బుధవారం ఇబ్రహీంబాగ్​లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో19 ఇంజినీరింగ్ ఇన్​స్టిట్యూట్స్ స్టూడెంట్స్​తో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల ఇప్పటికే ఎంతోమంది జైలుకు వెళ్లారని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.

గతంలో కొన్ని సంఘటనలు చూసి, బాధగా అనిపించిందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతనమైన శిఖరాలకు చేరుకోవాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ పై ప్రదర్శన పోస్టర్ లతోపాటు చిత్రలేఖన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో విజేతలకు సందీప్ శాండిల్య  బహుమతులను అందజేశారు. ఎస్పీలు సీతారాం, కృష్ణమూర్తి, డీఎస్పీలు హరిచంద్ర రెడ్డి, సుబ్బరామిరెడ్డి, ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రమణ పాల్గొన్నారు.