డ్యామ్​ల ఆపరేషన్​పై కమిటీ!

డ్యామ్​ల ఆపరేషన్​పై కమిటీ!
  • తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర,
  • కర్నాటక మీటింగ్​లో ప్రతిపాదన 
  • నీళ్ల విడుదల టైమ్​లో సమన్వయం లేక దిగువ ప్రాంతాల్లో ముంపు సమస్యలు
  • విజయవాడ విపత్తు అలాంటిదేనన్న అధికారులు
  • ప్రాజెక్టుల ఫ్లడ్ రూటింగ్​పై ఐఐటీ హైదరాబాద్/రూర్కీతో స్టడీకి ప్రపోజల్

హైదరాబాద్, వెలుగు: విజయవాడ ముంపు లాంటి విపత్తులు భవిష్యత్తులో జరగకుండా కృష్ణా, గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులను అన్ని రాష్ట్రాలు సమన్వయంతో ఆపరేట్ చేసుకోవాలని తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఫ్లడ్​డిశ్చార్జిపై రాష్ట్రాల మధ్య సరైన కోఆర్డినేషన్​ లేకపోవడం, ఎగువ నుంచి ఒకేసారి తక్కువ టైమ్​లో ఎక్కువ మొత్తంలో వరద​వచ్చేస్తుండడంతో దిగువ ప్రాంతాల్లో ఏం చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని అధికారులు అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే అంతర్రాష్ట్ర డ్యామ్ ల ఆపరేషన్​పై 4 రాష్ట్రాలకు చెందిన సీఈలతో కమిటీ వేయాలని ప్రతిపాదించారు. బుధవారం ఈ అంశంపై 4 రాష్ట్రాల అధికారులు, ఇద్దరు ఓయూ ప్రొఫెసర్లు, సీడబ్ల్యూసీ మెంబర్​ కన్వీనర్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్ల ఆపరేషన్​ ప్రొటోకాల్​పై చర్చించారు.b  ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ఫ్లడ్​రూటింగ్ పై​స్టడీ చేయించాలని ప్రతిపాదించారు. ఐఐటీ హైదరాబాద్​లేదా ఐఐటీ రూర్కీతో స్టడీ చేయించి రిపోర్ట్​తయారు చేయాలని నిర్ణయించారు.  

ఐదు అంశాల వారీగా స్టడీ.. 

ఐదు అంశాలపై ఐఐటీతో స్టడీ చేయించాలని అధికారులు ప్రతిపాదించారు. ఆటోమేటిక్​వెదర్​స్టేషన్స్, రాడార్, శాటిలైట్​డేటా ఆధారంగా రియల్​టైమ్ వర్షపాత వివరాలను వాడుకొని డేటా ఇంటిగ్రేషన్, ఎప్పటికప్పుడు డిజిటల్​ఎలివేషన్​మోడల్​(కొండ ప్రాంతాల్లో నదీ వ్యవస్థలను తెలిపే వివరాలు) రికార్డులు, డ్యామ్ ల వరద రికార్డులను ఎప్పటికప్పుడు అప్​డేట్​చేయడం, నదుల్లో జల ప్రవాహాలకు సంబంధించి అధునాతన మోడల్స్​తో అధ్యయనం చేయించాలని ప్రతిపాదించారు. రియల్​టైమ్ టెలిమెట్రీ వ్యవస్థల ద్వారా వరదలను అంచనా వేసి నియంత్రించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ALSO READ : సర్కార్​పై రిటైర్మెంట్ల భారం!

రియల్​టైమ్ మోడల్స్​తో రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలను ఆప్టిమైజ్​చేసుకోవాలన్నారు. డ్యామ్ లు, బ్యారేజీలపై క్లైమేట్​చేంజ్​ప్రభావం ఎంత వరకు పడుతుందో అంచనా వేయాలని సూచించారు. కాగా, డ్యామ్ లను నింపుకోవడం, పూర్తిగా నిండాక ఒకేసారి వరదను వదలాల్సి వస్తే ఆయా డ్యామ్ ల ఫెయిల్యూర్​వంటి అంశాలపై ఎగువ, దిగువన ఉన్న రాష్ట్రాలు ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని.. ఏదైనా సమస్య వస్తే ముప్పును తప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకోవాలని మీటింగ్​లో పేర్కొన్నారు.