కరీంనగర్ బోయవాడకు చెందిన కానిస్టేబుల్ రవి కూతురు గుండె పోటుతో మృతి చెందింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవి చిన్న కూతురు పుల్లూరి ఐశ్వర్య ..గౌహతి ఐఐటి కాలేజీలో చదువుతుంది. 2023, డిసెంబర్ 31న జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఐశ్వర్య పాల్గొని ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. ఆ మరుసటి రోజు 2024, జనవరి1వ తేదీ సోమవారం ఉదయం అస్వస్థతకు గురైన ఐశ్వర్యకు.. గుండెపోటు రావడంతో మరణించినట్లు స్నేహితులు తెలిపారు.
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఐశ్వర్య తల్లిదండ్రులు గౌహతి చేరుకుని.. కూతురు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకొచ్చి జనవరి 3వ తేదీ బుధవారం అంత్యక్రియలు చేశారు. కూతురు మృతితో కానిస్టేబుల్ రవి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.