
జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు: ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్ అన్నారు. బుధవారం జగదేవపూర్ ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గుబ్బ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాస్, కోశాధికారిగా అయిత బాలరాజు, పట్టణ అధ్యక్షుడు చిగుళ్లపల్లి వెంకటేశం, మండల యూత్ అధ్యక్షుడు మరిపడిగ రామకృష్ణ, మండల మహిళా అధ్యక్షురాలు అమర నాగజ్యోతి, సేవాదళ్ అధ్యక్షుడు రాచర్ల లక్ష్మణ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి బడ్జెట్ లో 25 కోట్లు కేటాయించిదన్నారు.
రానున్న రోజుల్లో కార్పొరేషన్ కు మరిన్ని నిధులను తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించగా అందులో ఈ బీసీలకు 10 శాతం కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నకర్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్, మాజీ అధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా కోశాధికారి నవీన్, జిల్లా యూత్ అధ్యక్షుడు మంకాల నాగేశ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, మండల మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షురాలు మాధవి, నాగరాజు పాల్గొన్నారు.