కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి గంగుల

కరీంనగర్, కరీంనగర్​ రూరల్/  కొత్తపల్లి, వెలుగు:  తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండేవని, కానీ బీఆర్ఎస్​అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినట్లు బీసీ సంక్షేమ,  పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల  కమలాకర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు క్వాలిటీ కరెంట్​ సప్లై చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శుక్రవారం తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో రూ.5.5 కోట్లతో చేపట్టిన సబ్ స్టేషన్లకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణంతో లోఓల్టేజీ స‌‌మ‌‌స్య తీర‌‌డంతోపాటు నిరంతరం క్వాలిటీ కరెంట్​ అందుతుంద‌‌న్నారు. తీగలగుట్టపల్లిలో రూ.2.5 కోట్లు, ఖాజీపూర్ లో రూ.3 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్లను  నిర్మిస్తున్నామన్నారు. రైతులు, వినియోగదారుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి గంగులను తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామస్తులు శాలువాలతో  సన్మానించారు.  

నెలన్నరలో టెంపుల్​ పునర్నిర్మిస్తాం

కొత్తపల్లి: రేకుర్తి లక్ష్మీనర్సింహస్వామి టెంపుల్​ పునర్నిర్మాణాన్ని నెలన్నరలోగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. టెంపుల్​ ముఖ ద్వార ప్రతిష్టాపన కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొని స్వామికి పూజలు చేశారు. టెంపుల్​ డెవలప్​ మెంట్​ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మేయర్​ యాదగిరి సునీల్​రావు, డిప్యూటీ మేయర్​ స్వరూపారాణి-, కార్పొరేటర్లు మాధవి, రాజశేఖర్​, గ్రంథాలయ చైర్మన్​ అనిల్​కుమార్​గౌడ్, ప్రకాశ్​ పాల్గొన్నారు.

బ్యూటిఫుల్ సిటీగా కరీంనగర్

కరీంనగర్ టౌన్:  రాష్ట్రంలో రెండో నగరంగా కరీంనగర్‌‌‌‌ను తీర్చిదిద్దుతామని  మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం మేయర్ ఛాంబర్ లో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ స్వరూపరాణి , కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కార్పొరేటర్లు, అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిటీ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  మరో రూ.150 కోట్లతో చేపట్టే పనులకు  టెండర్లు పిలుస్తామన్నారు.  మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాలతో నగరానికి పర్యాటక శోభ సంతరించుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే చక్కని రహదారులు,  డివైడర్లు, స్ట్రీట్​లైట్స్‌‌ వెలుగులతో నగరం సుందరంగా మారిందన్నారు.