ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ  బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. బిల్లు ఆమోదం తెలపడంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహా. ఎస్సీ ఎమ్మెల్యేలు కూాడా రేవంత్ కు అభినందనలు తెలిపారు.

 అసెంబ్లీలో  బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే ఎస్సీ బిల్లు తెచ్చామన్నారు రేవంత్.  రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీ సంపూర్థ మద్దతు పలికాయని తెలిపారు. వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్.  

ALSO READ | దళిత కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలి: కూనంనేని

వర్గీకరణ కోసం అనేక పోరాటాలు జరిగాయి.  వర్గీకరణ కోసం ఎంతో మంది ప్రాణాలు  కోల్పోయారు. ఉమ్మడి ఏపీకి దళితుడిని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ దే. దళిత బిడ్డ మీరాకుమారిని స్పీకర్ చేసిన చరిత్ర కాంగ్రెస్ దే. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.  దళితుల అభ్యున్నతనికి అనేక నిర్ణయాలు తీసుకుందే కాంగ్రెస్.  సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించింది. సుప్రీం తీర్పు వచ్చిన గంటసేపటికే ఎస్సీ వర్గీకరణపై సభలో ప్రకటన చేశాం. నూటికి నూరు శాతం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ఆనాడు చెప్పా.  ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం వేశాం..ఆరుసార్లు ఈ కమిటీ భేటీ అయింది. 8 వేలకు పైగా వినతిపత్రాలను ఈ కమిషన్ తీసుకుంది. ఉపసంఘం సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్ వేసింది.  ఏ ఒక్కరిక కూడా అన్యాయం జరగొద్దని కమిషన్ భావించింది. ఫిబ్రవరి 3న కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది.  ఫిబ్రవరి 4న ఈ రిపోర్ట్ ను కేబినెట్ ఆమోదించింది అని రేవంత్ అన్నారు.

 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించాం .  గ్రూప్ 1 లో 15 ఉపకులాలు ఒక శాతం రిజర్వేషన్ .  గ్రూప్ 2 కింద 18 ఉపకులాలు..8 శాతం రిజర్వేషన్.  గ్రూప్ 3 కింద 26 ఉపకులాలు చేర్చాం.. ఆరుశాతం రిజర్వేషన్ .15 శాతం రిజర్వేషన్లను ఈ మూడు గ్రూపులకు పంచాం. ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం. ఇందిరమ్మ ఇండ్లలో వీళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. రాజీవ్ యువ వికాసంలో అమరుల కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తాం. ఇకనైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరినట్టు దామాషా ప్రకారం కోటా పెంచుతాం. 2026 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం.రిజర్వేషన్లు పెంచడం,న్యాయపరంగా పంచడం మా బాధ్యత అని రేవంత్ అన్నారు.