బీఆర్ఎస్ తలుచుకుంటే తెలంగాణ అప్పు రూ. 7 లక్షల కోట్లు కట్టేస్తది.: సీఎం రేవంత్

బీఆర్ఎస్ తలుచుకుంటే  తెలంగాణ అప్పు రూ. 7 లక్షల కోట్లు కట్టేస్తది.: సీఎం రేవంత్

అసెంబ్లీలో గత బీఆర్ఎస్ సర్కార్ తీరును తూర్పారబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా మాట్లాడిన రేవంత్..  స్విస్ బ్యాంక్ కు అప్పు ఇచ్చే స్థాయికి     బీఆర్ఎస్ చేరుకుంద్నారు. బీఆర్ఎస్ తలుచుకుంటే  రాష్ట్ర అప్పు రూ. 7 లక్షల కోట్లు  కూడా కట్టేయగలదని చెప్పారు.ఎందుకంటే అంత సొమ్మును బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు.   బీఆర్ఎస్ హాయంలో రైతుబంధు పేరుతో రూ. 21 వేల కోట్లు వృథా చేశారని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్  నేతలు భారీగా దోచుకుని రాష్ట్రాన్ని దివాలా తీయించారని ధ్వజమెత్తారు

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

  • క్రషర్లు, రోడ్లకు ,మైనింగ్ లకు కూడా బీఆర్ఎస్   రైతుబంధు ఇచ్చింది
  • నకిలీ పట్టాలతో కూడా రైతు బంధు తీసుకున్నారు
  •  రాజీవ్ రహాదారికి కూడా రైతు బంధు ఇచ్చారు
  •  రైతు భరోసా అమలుపై ఎవరికీ అనుమానాల్లేవు
  • రైతులను ఆదుకోవాలనే రైతుభరోసా
  • ప్రతి  ఏటా 3 కోట్ల ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు.
  • ఏటా 3 వేల కోట్లు రైతుబంధు ఇచ్చారు
  • రోడ్డు విస్తరణకు పోయిన భూమికి కూడా రైతుబంధు ఇచ్చారు
  • రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతుబందు ఇచ్చారు
  •  రైతుబంధు పేరుతో వేలాది కోట్లు కొల్లగొట్టారు
  • రాళ్లు,రప్పలకు,కొండలకు,గుట్టలకు కూడా రైతుబందు ఇచ్చారు
  •  సాగులేని భూములకు రూ.21 వేల కోట్ల రైతు బంధు ఇచ్చారు.
  • బీఆర్ఎస్ నేతలు ఎంత చిల్లరగా ప్రవర్తించినా ఓపిగ్గా ఉన్నాం
  • గజ్వేల్ లో రాజీవ్ రహదారికి కూడా రైతుబంధు ఇచ్చారు
  • చివరి పేదవాడికి కూడా రైతు భరోసా ఇవ్వాలనేదే మా లక్ష్యం
  • మీరు కాదు  ఆదర్శం.. మాకు సాగు చేసే రైతులు  ఆదర్శం
  • మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే అసెంబ్లీ నుంచి బయటకే పోతం
  • రైతులకు మేలు చేసే సూచనలు ఇస్తే తీసుకుంటాం
  • ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వచ్చి రైతు భరోసాపై సలహాలు ఇస్తారని అనుకున్న
  • అబద్ధాలకు అద్యక్షుడు కేసీఆర్ సభకు రాలేదు..ఉపాధ్యక్షుడు కేటీఆర్ వస్తున్నారు
  •  రైతుల ఆత్మహత్యల్లో  దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉంది
  • రైతుల ఆత్మహత్యలు తగ్గాయని బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్నారు
  • బీఆర్ఎస్ మొదటి ఐదేళ్లలో  రూ. 16 వేల143 కోట్ల రుణమాఫీ చేసింది
  • సెకండ్ టర్మ్ లో రూ. 11 వేల 909 కోట్ల రుణమాఫీ చేసింది
  •  అర్థరాత్రి ఓఆర్ఆర్ అమ్మి రెండో విడత రుణమాఫీ  నిధులిచ్చారు
  • మేం వచ్చాక  రూ.27 రోజుల్లో 17 వేల 869 కోట్ల 21 లక్షల రుణమాఫీ చేశాం
  • నవంబర్ 30 మహబూబ్ నగర్ లో  3 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశాం
  • ఏడాదిలోనే మొత్తం రూ.20, 616  కోట్ల 89 లక్షలు రుణమాఫీ చేశాం
  • రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం
  • బీఆర్ఎస్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
  • స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే స్థాయికి బీఆర్ఎస్ చేరుకుంది
  •  బీఆర్ఎస్ తలుచుకుంటే రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్లు కూడా కట్టేస్తుంది
  •  రాష్ట్ర సంపదా అంతా బీఆర్ఎస్ నేతల దగ్గరకే  వెళ్లింది
  •  ఇంకా ఇప్పటి వరకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయకపోతే చేస్తాం
  • మాట తప్పని, మడమ తిప్పని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
  • తెలంగాణ ఇచ్చిన సోనియా దగ్గరకు వెళ్లి కృతజ్ఞతగా ఆమె కాళ్లు మొక్కిండు కేసీఆర్
  • బీఆర్ఎస్ చేసిన అప్పు రూ. 6 లక్షల 71 వేల  757 కోట్లు
  •  పలు శాఖలకు బకాయిలు రూ. 40,154 కోట్లు
  •  బకాయిలతో కలిపి  మొత్తం బీఆర్ఎస్ చేసిన  అప్పు 7 లక్షల 11 వేల 911 కోట్లు
  •  16 మంది సీఎంలు చేసిన అప్పు 72 వేల కోట్లు అయితే.. ఒక్క కేసీఆర్   6 లక్షల కోట్లకుపైగా అప్పు చేశారు
  • 2024 డిసెంబర్ 18 వరకు తెలంగాణ అప్పు 22 వేల 788 కోట్లు
  • నెలకు రూ. 6500 కోట్ల వడ్డీలు కడుతున్నాం