![తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 64.14 శాతం పోలింగ్](https://static.v6velugu.com/uploads/2023/11/telangana-assembly-elections-2023-6424-percent-polling-till-5-pm-in-telangana_pX3NSaRMrb.jpg)
తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 64.14 శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 82 శాతం..అత్యల్పంగా హైదరాబాద్ లో 42 శాతం నమోదయ్యింది. కొన్ని చోట్ల ఓటర్లు భారీగా క్యూ లైన్లో ఉండటంతో పోలింగ్ పర్సంటేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. పూర్తి పోలింగ్ వివరాలు రావడానికి సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆదిలాబాద్, హైదరాబాద్ లోని పలు చోట్ల ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం.
కేసీఆర్ ను ఓడగొడ్తం
కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడగొడతామని రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్ అని కేటీఆర్ అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా?. అని ప్రశ్నించారు.
70కి పైగా సీట్లు మావే
70 కి పైగా సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారని చెప్పారు. ఇంకా పోలింగ్ జరుగుతుందని.. శుక్రవారం ఉదయం ఫైనల్ పోలింగ్ పర్సంటేజ్ వస్తుందన్నారు. 2018లో వచ్చిన ఎగ్జిగ్ పోల్స్ తప్పని తేలాయని.. ఎగ్జిగ్ పోల్స్ ఓ రబ్బిష్ అని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే క్షమాపణలు చెప్తారా? అని అన్నారు.