
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో 119 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది.
ఉమ్మడి రంగారెడ్డి లో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారో చూద్దాం:
- షాద్ నగర్: కాంగ్రెస్ అభ్యర్థి కె శంకరయ్య
- ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి
- ఎల్బీనగర్: బీఆర్‌ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి
- చేవెళ్ల: బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య
- శేరిలింగంపల్లి: బీఆర్‌ఎస్ అభ్యర్థి బీఆర్‌ఎస్ అభ్యర్థి అరికెపూడీ గాంధీ
- మహేశ్వరం: బీఆర్‌ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి
- రాజేంద్రనగర్: బీఆర్‌ఎస్ అభ్యర్థి తొల్కంటి ప్రకాశ్ గౌడ్
- పరిగి: కాంగ్రెస్ అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డి
- వికారాబాద్: కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్
- మేడ్చల్: బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి
- మల్కాజ్ గిరి: బీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి
- ఉప్పల్: బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి
- కుత్బుల్లాపూర్: బీఆర్‌ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద గౌడ్
- తాండారు: కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి
- కూకట్ పల్లి: బీఆర్‌ఎస్ అభ్యర్థి అరికెపూడీ గాంధీ