తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. సభలో టూరిజంపై చర్చ జరుగుతుండగా లగచర్ల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఆందోళనల మధ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్. దీంతో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. బీఏసీ సమావేశం అనంతరం ప్రారంభమైన సభలో బీఆర్ఎర్ సభ్యులు లగచర్ల ఘనటపై చర్చకు పట్టుబట్టడంతో సభ రేపటికి వాయిదా పడింది.
ALSO READ | ముగిసిన బీఏసీ సమావేశం.. బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్
అంతకు ముందు బీఏసీ సమావేశం వాడివేడిగా సాగింది. సభ ఎన్ని రోజులు నడుపాతారో చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీఏసీ మీటింగ్ అంటే చాయ్, బిస్కెట్ మీటింగ్ లా మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సభ పనిదినాలపై స్పష్టత ఇవ్వడం లేదని బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేది స్పీకర్ నిర్ణయమని అన్నారు. గత పదేళ్లుగా బీఏసీ సమావేశాన్ని చాయ్ బిస్కెట్ మీటింగ్ లాగానే నడిపారా అని ప్రశ్నించారు. సభ ఈ శుక్రవారం వరకు నిర్వహించనున్నట్లు స్పష్టత ఇచ్చారు.