ఈ నెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమవ్వగా.. నిన్న ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయసభల్లో చర్చ నడుస్తోంది. ఈ నెల 6న ఆర్థికమంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 7న అసెంబ్లీకి సెలవు కాగా.. 8 నుంచి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. 8న బడ్జెట్ పై సాధారణ చర్చ జరగుతుంది.  9,10,11 తేదీల్లో శాఖల వారీగా పద్దులపై శాసనసభలో చర్చ జరగనుంది. ఈ నెల 12  ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది.