తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియేట్ ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు శాసనసభ స్పీకర్ ఎన్నికకు అభ్యర్థుల నుంచి నామినేషన్ స్వీకరిస్తారు. డిసెంబర్ 14వ తేదీ ఉదయం శాసనసభలో స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు.
ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం.. సీనియర్ నాయకుడు, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ ను చేయాలని ఆయన పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఒక్కరే నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ గా ఎన్నికునే అవకాశం ఉంది. అలా కాకుండా ఇతర సభ్యులు నామినేషన్ వేస్తే.. బ్యాలెట్ ద్వారా స్పీకర్ ను ఎన్నుకుంటారు. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర శాసన సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ప్రమాణస్వీకారం చేయించారు.