సమ్మక్క, సారలమ్మ.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం: సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మ.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ( డిసెంబర్ 9) ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు పునాది పడిన రోజన్నారు.  2009.. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనను సోనియాగాంధీ ప్రకటించారన్నారు.  తెలంగాణ ప్రజల ఆంకాక్షలను నెరవేర్చిన సోనియాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. 

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజన్నారు. సచివాలయం సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటున్నామని సీఎం రేవంత్ అన్నారు.  ఇప్పటి వరకు తెలంగాణలో ...తెలంగాణ తల్లికి గుర్తింపు లేదన్నారు.  మన సంస్కృతి .. సంప్రదాయాలకు తగ్గట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటున్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్ తెలిపారు.

Also Read :- అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు

 సమ్మక్క.. సారలమ్మ.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందిచామన్నారు.  ఆకుపచ్చ చీర..కంఠ హారంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.  తెలంగాణ ఉద్యమం ఓ భావోద్వేగమైన సందర్భం అన్నారు.   తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల మంది ప్రజల భావోద్వేగమన్నారు. 

చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నామన్నారు. తెలంగాణ తల్లికి అధికారిక గుర్తింపు ఇస్తున్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్ తెలిపారు.   అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించామన్నారు.