మార్చి12 నుంచి అసెంబ్లీ సమావేశాలు

మార్చి12 నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • నోటిఫికేషన్ రిలీజ్​ చేసిన
  • అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఇం దుకు సంబంధించిన నోటిఫికేషన్​ను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు శుక్రవారం రిలీ జ్ చేశారు. 12న గవర్నర్ స్పీచ్​తో సెషన్ ప్రారం భమవుతుంది. గవర్నర్ స్పీచ్ తరువాత బీఏసీ సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు సభ నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

తరువాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే బిల్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.