మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. సభలో బీఆర్ఎస్ ఆందోళన

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. సభలో బీఆర్ఎస్ ఆందోళన

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను బెదిరించేలా వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సెషన్ అయిపోయే వరకూ జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.

సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క కోరారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు  చేయడంతో జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. జగదీశ్ రెడ్డి అహంకారంతో వ్యవహరించారని, ఏక వచనంతో స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడతారా అని ఉత్తమ్ మండిపడ్డారు. ఏ హక్కు ఉందని స్పీకర్ ను క్వశ్చన్ చేస్తారని మంత్రి ఉత్తమ్ నిలదీశారు. 

Also Read : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం

సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఈ సభ మీ సొంతం కాదని స్పీకర్పై జగదీశ్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీలో పెను దుమారం రేగింది. జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేసేంత వరకూ పరిస్థితి వెళ్లడం గమనార్హం.