
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అథ్లెట్ గందె నిత్య.. నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్‌తో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 100 మీటర్ల రేస్‌లో నిత్య 11.79 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచింది. స్నేహా (11.62 సె), గిరిధారాణి (11.72 సె) టాప్–2లో నిలిచి వరుసగా గోల్డ్, సిల్వర్‌ను సొంతం చేసుకున్నారు.