హాంగ్జౌ: తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి.. ఆసియా పారా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. మంగళవారం జరిగిన విమెన్స్ 400 మీటర్ల (టీ20 కేటగిరీ) రేస్‌లో దీప్తి 56.69 సెకన్లతో ఆసియా రికార్డును కొల్లగొట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇతర క్రీడాంశాల్లోనూ ఇండియా అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు.
మెన్స్ క్లబ్ త్రో ఎఫ్–51లో ప్రణవ్ సోర్మా (30.01 మీ.), ధరంబీర్ (28.76 మీ.), అమిత్ కుమార్ (26.93 మీ) వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను సాధించారు. విమెన్స్ ఆర్2, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో అవనీ లేఖర 249.6 పాయింట్లతో స్వర్ణాన్ని గెలిచింది.