తెలంగాణ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లకు పతకాలు

తెలంగాణ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లకు పతకాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: నేషనల్ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ అథ్లెట్లు పతకాల మోత మోగించారు. కేరళలోని త్రిస్సూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ టోర్నీలో ఎం.ఎల్.ఎన్.రెడ్డి  షాట్ పుట్, డిస్కస్ త్రో, హామర్ త్రో ఈవెంట్లలో మూడు గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. 

ఈ టోర్నీలో పతకాలు నెగ్గిన మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లను శుక్రవారం ఎల్బీ స్టేడియం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అభినందించారు. 80 ఏండ్ల వయసులోనూ ఆటల్లో రాణిస్తున్న వీళ్లంతా  రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు.