
- తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు యూనియన్ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం డిసెంబర్ మొదటి వారంలో చర్చలు జరపాలని తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్లు ఉపాధి దెబ్బతీస్తున్న మహాలక్ష్మి పథకంపై పునరాలోచన చేయాలని కోరింది. జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో సోమవారం మహాధర్నా చేపట్టారు. నాయకులు అల్లూరి రవిశంకర్, పెంటయ్య గౌడ్, బోస్, ఎండీ హబీబ్, రవి, సమ్మయ్య యాదవ్, మంద రవికుమార్ మాట్లాడుతూ.. రవాణా రంగంలో వన్ నేషన్ వన్ టాక్స్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తమ ఉపాధిని దెబ్బతీస్తున్న ఓలా, ఉబర్, రాపిడో బైకుల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలన్నారు. గ్రేటర్ పరిధిలో ఆటో మీటర్ల రేట్లు పెంచాలని ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమ కోసం వెల్ఫేర్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు..