డిసెంబర్ 7న రాష్ట్ర బంద్ కు దిగుతున్నం : జేఏసీ నాయకులు

డిసెంబర్ 7న రాష్ట్ర బంద్ కు దిగుతున్నం : జేఏసీ నాయకులు
  • సమ్మె నోటీస్​ అందజేసిన ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన ఆటో సంఘాల జేఏసీ నాయకులు సోమవారం ఆర్టీఏ జాయింట్​కమిషనర్​రమేశ్​కుమార్​కు సమ్మె నోటీస్​అందజేశారు. తమ సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్​ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

 ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఒకరోజు ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బంద్​లో భాగంగా సిటీలో లక్షమంది రవాణారంగ కార్మికులతో కలిసి భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కమిషనర్​ను కలిసిన వారిలో జేఏసీ నేతలు బి.వెంకటేశం, ఎం.ఎ.సలీమ్, ఎ.సత్తిరెడ్డి, ప్రవీణ్​ఉన్నారు.