![సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట: ఆటో డ్రైవర్ల యూనియన్స్ జేఏసీ వెల్లడి](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-auto-drivers-union-joint-action-committee-tadu-jac-has-announced-a-statewide-protest_9jnWK4OVLX.jpg)
బషీర్ బాగ్, వెలుగు: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని తెలంగాణ ఆటో డ్రైవర్ల యూనియన్స్ జేఏసీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చకుండా అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిమాయత్ నగర్ లో ఏఐటీయూసీ ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న నారాయణగూడ ఫ్లై ఓవర్ వద్ద ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.