
సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జడ్పీచైర్మన్ రోజారాధాకృష్ణ శర్మతో కలిసి దుబ్బాక, హుస్నాబాద్, జిల్లాలోని జనగాం, మానకొండూర్ నియోజకవర్గలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2న జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్ రావు జెండా ఆవిష్కరణ ఉత్సవాలు ప్రారంభిస్తారని,
మండలం, గ్రామాల్లో ముఖ్య అధికారులు జెండా ఆవిష్కరణ చెయ్యాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రోజుకో కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమేశ్, డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్ రెడ్డి, డీఏవో శివప్రసాద్, డీపీవో దేవకి దేవి, డీఎంహెచ్‌వో డా. కాశీనాథ్, డీఎఫ్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.