తెలంగాణ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకు, యువతులకు బతుకమ్మ పండుగ కానుకగా ఇచ్చే చీరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం గంగారాం నగర్ లో నాణ్యత లేని చీరలు ఇస్తున్నారని.. ఆ చీరలను మహిళలు రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేశారు.
- ALSO READ | సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ మెనూ ఇదే..
గివేం బతుకమ్మ చీరలు.. మాకు నచ్చలేవని నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. కొంతమంది ఈ చీరెలు బతుకమ్మ పండుగకు ఎలా కట్టుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఈ చీరలు పంట చేలకు రక్షణగా, బొంతలు కుట్టుకోవడానికి తప్పా ఇంకా దేనికి పనికిరావని మండిపడ్డారు. ప్రభుత్వం నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.