కేసీఆర్​ పాలనలో ఆగమైన బీసీలు.. బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం

కేసీఆర్​ పాలనలో ఆగమైన బీసీలు.. బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్​షా ప్రకటించడం హర్షణీయం.  దీనికి తెలంగాణ బీసీల తరఫున ధన్యవాదాలు. గత 50 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి  బీసీ ముఖ్యమంత్రి లేని లోటు బీజేపీ పూరిస్తుందని అమిత్​షా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. బీసీ ముఖ్యమంత్రి హామీ మరేపార్టీ ఇవ్వలేకపోతున్నది. అది కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని అమిత్​షా నిరూపించారు. అందుకు బీజేపీ అగ్రనాయకత్వానికి అభినందనలు తెలుపుదాం.


ఊరూరా కుల సంఘాలు, జాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసుకొని తెలంగాణ వస్తే  మా బతుకులు బాగుపడుతాయన్న సబ్బండ వర్ణాల ఆశలు గల్లంతయ్యాయి. వారి ఆకాంక్షలు రాష్ట్రం ఏర్పడిన గత 10 ఏండ్ల కాలంలో పూర్తిగా నీరుగారిపోయాయి. బీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఇచ్చే రుణాలు పూర్తిగా బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినాయి. పదేండ్లలో ఇప్పటి వరకూ ఇచ్చింది కేవలం 90వేల మందికే.  5 లక్షల మంది అప్లై చేసుకుంటే..2018, 2023 ఎన్నికల ముందు ఆవేశంతో రగులుతున్న లక్షలాది మందిపై నీళ్లు చల్లినట్లు అరకొరగా రుణాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది ఈ ప్రభుత్వం. బీసీలను కేసీఆర్ ​ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది.

 కార్పొరేషన్, ఫెడరేషన్లను  ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఏనుగు తొండమంత నిధులు ప్రకటించి, ఎలుక తోకంత ఖర్చు చేసింది  కేసీఆర్​ సర్కారు. ఎంతో హడావుడి చేసి ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి, మూడేండ్ల నుంచి రూ.3వేల కోట్లు కేటాయించి కేవలం రూ.7 కోట్లు ఖర్చు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది.  కరోనా కష్ట సమయంలో అనేక కులవృత్తులవారు కష్టాలపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం కనీస ఆర్థిక సహాయం కూడా బాధిత కుటుంబాలకు చేయలేదు. -52శాతం ఉన్న బీసీలకు బడ్జెట్​ కేటాయింపు అంతంతమాత్రమే. మొత్తం 2.56 లక్షల కోట్లకుపైగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీసీలకు కేవలం 5,698 కోట్లే కేటాయించినా. అదీకూడా ఖర్చుమాత్రం శూన్యం. బీసీ బంధు ఇస్తాననీ ఇవ్వలేదు.

రాజకీయ అణచివేత

దాదాపు 38శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉంటే కేసీఆర్​ దాదాపు 10శాతం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గించి 23 శాతానికి కుదించారు. బీసీలు తెలంగాణలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కాకుండా రాజకీయ అణచివేతకు గురవుతున్నారు.- అనేకమందికి కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలక మండళ్లు సృష్టించి ఇచ్చిన ప్రభుత్వం బీసీలకు సంబంధించిన కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్లకు మాత్రం ఎటువంటి పాలక మండళ్లను నియమించలేదు. -శాసనమండలిలోకాని, నామినేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల్లో కాని బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవులు 36లో కేవలం 3,  ఎమ్మెల్సీల 40లో 4 మాత్రమే అందాయి. 52శాతం జనాభా ఉన్న బీసీలకు మంత్రి మండలిలో ముగ్గురు మంత్రులు ఉంటే కేసీఆర్​ కుటుంబం, సామాజికవర్గానికి నాలుగు మంత్రి పదవులు. ఎమ్మెల్యే సీట్లలో కూడా బీసీ అభ్యర్థులకు సరైన వాటా ఇవ్వడం లేదు.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో చేనేత, గీత వంటి అనేక కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయి.  

విశ్వకర్మలైన స్వర్ణకారులకు, వడ్డెరలకు, వడ్రంగులకు, మేదరులు, రజక, నాయీబ్రాహ్మణ వర్గాలకు సరైన న్యాయం జరగలేదు. ఆరెకటికెలకు చెందిన స్లాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్లు అన్యమతస్తులకు, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తులకు ధారాదత్తం అయ్యాయి.  వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్ల మీదనే వందల కోట్లు వసూలు చేసినంత కూడా గౌడల సంక్షేమానికి ఖర్చు చేయలే. కుమ్మరి, మున్నూరుకాపు, గంగపుత్ర, ఇంకా అనేక కులాలవారి కొత్త కార్పొరేషన్లకు మోక్షం లభించలేదు. ముదిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కులాల వారికి కనీసం ఎమ్మెల్యే టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వలే. ఎంబీసీ సంచార జాతులకు కనీస నిధులు కాని, గుర్తింపుకాని ఇవ్వలేదు. గొల్లకురుమలు తనకు నచ్చిన గొర్లు తీసుకొనుటకు అవకాశం ఇవ్వక ఆ పథకాన్ని అవినీతి మయం చేశారు. 

డబుల్​ ఇంజన్​ సర్కార్​తోనే బీసీలకు న్యాయం

నిరాశ, నిస్పృహలతో అలమటిస్తున్న బీసీలకు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి రాజ్యాధికారమే అజెండాగా బీజేపీ అండగా నిలుస్తుంది. బీజేపీ జెండా బీసీలకు అండగా మారింది.  నియంతృత్వ పాలనలో,  కుటుంబ అవినీతి , అణచివేతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బడుగు, బలహీన వర్గాలు చైతన్యమవ్వాలి.  ఓట్లు మావే.. సీట్లూ మావే అంటూ ఉద్యమమే ఊపిరిగా కేసీఆర్​ రాచరికంపై రాజకీయ పోరాటం చేయాలి. రాజ్యాధికారం ఉంటేనే సబ్బండ వర్గాల ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి. ఇది  బీజేపీతోనే సాధ్యం. ఈ దేశానికి ఒక బీసీ ప్రధానిని ఇచ్చింది బీజేపీ.  ఇపుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేయబోతున్నదీ బీజేపీ. ఈ రాష్ట్రంలో  బీసీల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, రాజ్యాధికారం, ఆత్మగౌరవం కేవలం బీజేపీ డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కారుతోనే సాధ్యం. 

విద్యలో కూడా వివక్ష 

క్రిస్టియన్లకు, ముస్లింలకు 100శాతం ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్న ప్రభుత్వం బీసీలలో ఉన్న హిందూ విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నది. అనేక షరతులతో 11శాతం మాత్రమే హిందూ బీసీలకు ఇస్తున్నది. ఇదేమి వివక్ష. స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. వేలకోట్లు ప్రభుత్వం బకాయిపడ్డది. సకాలంలో నిధులు ఇవ్వక విద్యార్థులు వారి తల్లితండ్రులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. జనాభా ప్రకారం బీసీలకు 1000 గురుకులాలు ఉండాలి.  కానీ,  కేవలం 260 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ గురుకుల్లాలో టీచర్ల రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగలేదు.  మెరుగైన సదుపాయాలు లేవు. 12 శాతం ఉన్న మైనారిటీలకు 192 గురుకులాలు ఉన్నాయి.  పేపర్ల లీకేజీ, ప్యాకేజీలతో ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది.  బీసీలకు ఉపాధి కల్పన అంటే కేవలం గొర్లు, బర్లు పెంపకమే అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కొత్త పేచీలు పెట్టకుండా ఉన్న గోచినే బీసీలు కాపాడుకోవాలే అన్న దృక్పథం కేసీఆర్ ప్రభుత్వానిది.

- ఆలె భాస్కర్,​అధ్యక్షుడు,రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా