డేటా హబ్@ హైదరాబాద్: 98 వేల కోట్ల పెట్టుబడులుకు దిగ్గజ సంస్థల ఒప్పందం

డేటా హబ్@ హైదరాబాద్: 98 వేల కోట్ల పెట్టుబడులుకు దిగ్గజ సంస్థల ఒప్పందం
  • ఫ్యూచర్ సిటీకి మహర్దశ
  • ఔటర్ చుట్టూ ఐటీ విస్తరణ
  • దావోస్ అగ్రిమెంట్లలో డేటా సెంటర్లే ఎక్కువ
  • రాష్ట్రానికి పెట్టుబడుల వరద
  • ఏఐ, క్లౌడ్ టెక్నాలజీకి పెరిగిన ప్రాధాన్యం

హైదరాబాద్: హైదరాబాద్ గ్లోబల్ డేటా హబ్ గా అభివృద్ధి చెందబోతోంది.  దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీతోపాటు ఔటర్ చుట్టూ ఐటీ పరిశ్రమ విస్తరణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో చేసుకున్న ఒప్పందాల్లో ఎక్కువ భాగం డేటా కేంద్రాలే ఉండటం, ఇవన్నీ ఏఐ ఆధారిత సెంటర్లే కావడం విశేషం.    ఒక్క డేటా సెంటర్లలోనే 98 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవడం విశేషం.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యం పెరుగుతుండటంతో సర్కారు డేటా, క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానానికి  సంబంధించిన పరిశ్రమలకే ప్రాధాన్యం ఇచ్చింది.

దిగ్గజ సంస్థలైన అమెజాన్, ఇన్ఫోసిస్, బ్లాక్ స్టోన్, కంట్రోల్ ఎస్ లతో కీలక ఒప్పందాలు చేసుకోవడం విశేషం. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తెలంగాణ పెవిలియన్ లో ఆరు గ్లోబల్ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. ఒక్క డేటా సెంటర్లకు సంబంధించే 98 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం విశేషం. ఈ సంస్థలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయబోయే వసతులు, గ్రీన్ ఎనర్జీ, కాలుష్య రహితంగా రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన భరోసా మేరకే ఏర్పాటుకు సిద్ధమవుతుండటం విశేషం.

ఇవాళ అమెజాన్ సంస్థ 60 వేల కోట్లతో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది. మరో వైపు ఇన్ఫోసిస్ కూడా పోచారంలో ఐటీ క్యాంపస్ కోసం అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో పాటు బ్లాక్ స్టోన్ సంస్థ 150 మెగావాట్ల సామర్థ్యంలో గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 4,500 కోట్ల రూపాయలు  పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ALSO READ | హైదరాబాద్‎కు రెండు భారీ డేటా సెంటర్లు: రూ.10 వేల కోట్లకు దావోస్‎లో డీల్

టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ 300 మెగావాట్ల సామర్థ్యంలో డేటా కేంద్రాన్ని నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం 15 వేల కోట్లు పెట్టుబడిగా  పెట్టనుంది. అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ఏఐ ఆధారిత గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ సంస్థ ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. 

ఫ్యూచర్ సిటీకి మహర్దశ.. ఔటర్ చుట్టూ ఐటీ విస్తరణ

ఫ్యూచర్  సిటీలో పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. కాలుష్య  రహితంగా, అత్యాధునిక వసతులతో ఏర్పడనున్న ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపారు. ఇన్ఫోసిస్ పోచారంలో కొత్త క్యాంపస్  ఏర్పాటుకు సిద్ధమైంది. హైటెక్ సిటీ కంట్రోల్ ఎస్ సంస్థ మరో క్యాంపస్ ను విస్తరించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఐటీ పరిశ్రమలు విస్తరించే అవకాశాలున్నాయి. 

సంస్థ            పెట్టుబడి (రూ. కోట్లలో)

కంట్రోల్ ఎస్        10,000

అమెజాన్            60,000

టిల్మన్ గ్లోబల్        15,000

 ఉర్సా క్లస్టర్స్        5,000

 బ్లాక్‌స్టోన్             4,500

ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్    3,500