సన్నబియ్యం పంపిణీ దేశంలోనే ఫస్ట్ : మంత్రి పొన్నం ప్రభాకర్

సన్నబియ్యం పంపిణీ దేశంలోనే ఫస్ట్ : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్​) వెలుగు: దేశంలోనే తెలంగాణలో మొదటి సారి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, ఫౌరసరఫరాల మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదివారం ప్రారంభిస్తారని చెప్పారు. శనివారం హుస్నాబాద్​లోని క్యాంపు ఆఫీస్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త రేషన్​కార్డులను ఏప్రిల్​లో జారీ చేస్తామని, కార్డు హోల్డర్లు ఎక్కడున్నా బియ్యం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఉగాది రోజు వెయ్యి మందికి సీఎంఆర్​ఎఫ్​చెక్కులను పంపిణీ చేస్తామన్నారు.

గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహాసముద్రం గండి వద్ద ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థలం సేకరించామని, అక్కడి రైతులు పూర్తిగా సహకరించారని తెలిపారు. అనంతరం ముస్లింలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఇఫ్తార్​ విందులో పాల్గొన్నారు. ఆయన వెంట లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, ఆర్డీవో  రామూర్తి, మున్సిల్​కమిషనర్​మల్లికార్జున్, నాయకులు ఉన్నారు.