హైదరాబాద్, వెలుగు: సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే వివరాల డిజిటలైజేషన్ ప్రారంభమైంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సర్వే పూర్తవడంతోపాటు మరికొన్ని జిల్లాల్లో 90 శాతానికి పైగా వివరాల సేకరణ కంప్లీట్ చేశారు. ఇప్పటిదాకా సేకరించిన వివరాలను డిజిటలైజేషన్ చేయటం మొదలు పెట్టారు. సర్వే కొనసాగుతుండగానే, డేటాను కంప్యూటరీకరణ చేయాలని సీఎస్ ఆదేశించారు.
ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సర్వేలో 1,16,93, 698 నివాసాలు గుర్తించగా, శనివారం నాటికి 1,05,03,257 ఇండ్లలో సర్వే పూర్తి చేశారు. 89.8 శాతం సర్వే కంప్లీట్ అయింది.