హక్కున్న భూమి రికార్డుల్లో చేరకపోతే భూభారతి‌లో ఇలా అప్లై చేసుకోండి..!

హక్కున్న భూమి రికార్డుల్లో చేరకపోతే భూభారతి‌లో ఇలా అప్లై చేసుకోండి..!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భూభారతి రూల్స్ రిలీజ్ చేసింది. ఇక కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదని, అప్పీళ్లకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు ఉంటుందని తెలిపింది. కలెక్టర్లు, ఆర్డీవోలకు సవరణ అధికారాలు పేర్లు, విస్తీర్ణం, భూమి రకం తదితర అంశాల్లో తప్పులను సరిదిద్దేందుకు చాన్స్ ఉంటుందని స్పష్టం చేసింది. 

భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు లేవని, ధరణి డేటాతోనే భూభారతి ఉంటుందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. కలెక్టర్లు, ఆర్డీవోలకు సవరణ అధికారాలు పేర్లు, విస్తీర్ణం, భూమి రకం తదితర అంశాల్లో తప్పులను సరిదిద్దేందుకు చాన్స్ ఉంటుందని స్పష్టం చేసింది. భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు లేవని, ధరణి డేటాతోనే భూభారతి ఉంటుందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

వీలునామా, వారసత్వ మ్యుటేషన్
వీలునామా, వారసత్వం (ఇంటెస్టేట్ లేదా టెస్టమెంటరీ) ఆధారంగా మ్యుటేషన్ కోసం భూభారతి పోర్టల్‌‌లో తహసీల్దార్‌‌కు దరఖాస్తు చేయాలి. ఇంటెస్టేట్ వారసత్వం విషయంలో వారసులందరి నుంచి జాయింట్ అఫిడవిట్ సమర్పించాలి. సర్వే/సబ్-డివిజన్ మ్యాప్ (కమిషనర్ నోటిఫై చేసిన తేదీ నుంచి) కూడా సమర్పించాలి. 

►ALSO READ | భూభారతి రూల్స్ రిలీజ్.. భూధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జారీ ఇలా..

తహసీల్దార్ నోటీసు జారీ చేసి, గ్రామ పంచాయతీ, తహసీల్ కార్యాలయంలో ప్రకటన ప్రచురిస్తారు. 7 రోజుల్లో అఫిడవిట్, ఆధారాలు సమర్పించాలి. తహసీల్దార్ రికార్డులను పరిశీలించి, ఫీల్డ్ ఇన్‌‌స్పెక్షన్ నిర్వహించవచ్చు. 30 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఆర్డర్ జారీ కాకపోతే, దరఖాస్తుదారు పేరు డీమ్డ్ మ్యుటేషన్‌‌గా చేరుతుంది. మ్యుటేషన్ ఆమోదమైతే, కొత్త లేదా అప్‌‌డేట్ చేసిన పట్టాదార్ పాస్‌‌బుక్ జారీ చేస్తారు.

రికార్డుల సవరణ
హక్కున్న భూమి రికార్డుల్లో చేరకపోతే, రికార్డ్ ఆఫ్ రైట్స్‌‌లో తప్పు ఎంట్రీ ఉంటే భూభారతి పోర్టల్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి ఏడాది గడువు ఉంటుంది. దరఖాస్తుదారు పట్టాదార్ పాస్‌‌బుక్, టైటిల్ డీడ్, పహాణీ, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేదా ఇతర ఆధారాలతో అఫిడవిట్ సమర్పించాలి.

సంబంధిత అధికారి దరఖాస్తుదారుకు, రికార్డుల్లో ఉన్న వ్యక్తులకు, హక్కు కోరే ఇతరులకు నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందిన 7 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి. అభ్యంతరాలు లేకపోతే, మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అధికారి భూరికార్డులను పరిశీలించి, ఫీల్డ్ ఇన్‌‌స్పెక్షన్ నిర్వహించవచ్చు. విచారణ జరిపి 60 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఈ ఆర్డర్‌‌ను పోర్టల్‌‌లో అందుబాటులో ఉంచి, పార్టీలకు తెలియజేస్తారు.