రెవెన్యూలో భూభారతిగొప్ప ముందడుగు

రెవెన్యూలో భూభారతిగొప్ప ముందడుగు
  • ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ట్రెసా 

హైదరాబాద్, వెలుగు: భూభారతి -2024 ఆర్వోఆర్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి , రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌‌నివాస‌‌రెడ్డికి ట్రెసా రాష్ట్ర కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. రైతుల, ఉద్యోగులు, ప్రజల అభిప్రాయాలను తీసుకొని చట్టాన్ని రూపొందించడంపై హర్షం వ్యక్తం చేశారు.  

ఇది రైతుల భూ యాజమాన్య హక్కుల పరిష్కారంలో ఒక గొప్ప ముందడుగని.. ప్రజల చెంతకు భూపరిపాలన - తెచ్చారని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యలపై అధ్యయనానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 9న ఐదుగురు సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.