ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. శుక్రవారం (నవంబర్ 10న) ఉదయం 14 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మూడు స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ మార్చేసింది. వనపర్తి, చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి అభ్యర్థులను మారుస్తూ బీజేపీ అధిష్టానం చివరి జాబితాను విడుదల చేసింది.
Also Read :- మధిర అభివృద్ధికి పరితపిస్తూనే ఉంటా : భట్టి విక్రమార్క
వనపర్తిలో అశ్వద్ధామరెడ్డికి బదులు అనుగ్నారెడ్డికి టికెట్ ఇచ్చింది. బెల్లంపల్లిలో శ్రీదేవికి బదులు కొయ్యాల ఏమాజీకి టికెట్ కేటాయించింది. బెల్లంపల్లిలో గురువారం (నవంబర్ 9న) బీజేపీ అభ్యర్ధిగా శ్రీదేవి నామినేషన్ వేశారు. అలాగే చాంద్రాయణగుట్టలో మహేందర్‌కు టికెట్ కేటాయిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
14మంది అభ్యర్థుల జాబితా ఇదే..
బెల్లంపల్లి - కొయ్యాల ఎమాజీ
పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్ రావు
సంగారెడ్డి - రాజేశ్వరరావు
నర్సంపేట - పుల్లారావు
దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి
నాంపల్లి - రాహుల్ చంద్ర
కంటోన్మెంట్ - గణేష్
శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్
మల్కాజ్ గరి - రామచంద్రరావు
మేడ్చల్ - ఏనుగు సుదర్శనరెడ్డి
వనపర్తి- అనుగ్నారెడ్డి
చాంద్రాయణగుట్ట - మహేందర్
మధిర - విజయరాజు