ఏడేళ్ల పాటు ఏం చేశారు?

తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీసులో నిరుద్యోగ దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారన్నారు. ఈరోజు ఉద్యమ కారులంతా బీజేపీ వెంట నడుస్తున్నారన్నారు. కేసీఆర్ నిరుద్యోగుల్ని మోసం చేశారన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన యువతను సీఎం మరిచిపోయారన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు తరుణ్ చుగ్ బహిరంగ సవాల్ చేశారు. ఏడేళ్ల పాటు మీరేం చేశారు? బండి సంజయ్ తో బహిరంగ చర్చకు సిద్ధమా ? అంటూ సవాల్ చేశారు.  
ఏడేళ్ల మోదీ పాలన.. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. 

ఉద్యోమ ద్రోహులకు టీఆర్ఎస్ పెద్ద పీట వేస్తోందన్నారు. నిరుద్యోగ దీక్షకు వస్తున్న నేతల్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు తరుణ్ చుగ్. కరోనా మహమ్మారి కోసం మీరేం చేశారు ? 
పేదలకోసం మీరేం ఏం చేశారు ? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇవాళ దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి  మోడీ సర్కార్ ఉచితంగా బియ్యం అందిస్తోందన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ సర్కార్ ఫ్రీ టీకా ఇవ్వలేదన్నారు. దేశప్రజలకు ఉచితంగా మోడీ సర్కార్ వ్యాక్సిన్ ఇచ్చిందన్నారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు 
తెలంగాణలో యువత ఆత్మహత్యలకు చేసుకుంటున్నారన్నారు. ఉద్యోగాలు లేక అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. డిగ్రీలు, చదువులు మాని... తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొందన్నారు. ఆ యువత చేసిన పోరాటంతో కేసీఆర్ అధికార పీఠం ఎక్కారన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని కేసీఆర్.. యువతను మభ్య పెట్టారన్నారు. ఇన్నేళ్లు గడిచినా... బంగారు తెలంగాణ మాత్రం రాలేదన్నారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడ్డాయన్నారు. ప్రతీ ఇంటికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆ హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు. 
టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీం అని తరుణ్ చుగ్ ఆరోపించారు. బంగారు తెలంగాణ వచ్చే వరకు ప్రతీ బీజేపీ కార్యకర్త పోరాడాలని పిలుపు నిచ్చారు.