కాకా తయారుచేసిన నాయకులు దేశంలో పెద్ద ఎత్తున ఉన్నరు : బండి సంజయ్

కాకా తయారుచేసిన  నాయకులు దేశంలో  పెద్ద ఎత్తున ఉన్నరు  :  బండి సంజయ్

మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) 94వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర బీజేపీ నేతలు పూలమాల వేసి  నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, రాజ్యసభ ఎంపీ సభ్యుడు లక్ష్మణ్,  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్  వెంకటస్వామి పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  హైదరాబాద్ ప్రజలతో కాకాకు ప్రత్యేక  అనుభందం ఉందన్నారు.  ఆయన కార్మిక పక్షపాతి అని కొనియాడారు. అనేక  కార్మిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పోరాటం చేశారని గుర్తుచేశారు.   పేదల కోసం  వందల బస్తీలు  కట్టించారని, హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళిన కాకా ,అంజయ్య పేర్లను ప్రజలు  నిత్యం తలుచుకుంటారని చెప్పారు. కాకా స్ఫూర్తితో ముందకు వెళ్లాలని సూచించారు. 

 బండి సంజయ్ మాట్లాడుతూ..  పేదల దేవుడు కాకా అని ఆయనకు వచ్చిన పేరు ఎవరికి రాదన్నారు.  పేదల కోసం నిత్యం పోరాటం చేసిన కాకా తెలంగాణ కోసం జైలుకు కూడా పోయారని గుర్తుచేశారు.  యువకులను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది కూడా కాకానే అని తెలిపారు.  కాకా తయారు చేసిన  నాయకులు ప్రస్తుతం  దేశంలో  పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పారు.  వివేక్ వెంకటస్వామిని చూస్తే కాకాను చూసినట్టు ఉంటుందని, కాకా అడుగు జాడల్లో వివేక్ నడుస్తున్నారని అన్నారు.  

Also Read :- కాకా వెంకటస్వామికి నివాలర్పించిన మాజీ ఎంపీ వివేక్

లక్ష్మణ్ మాట్లాడుతూ..   హైదరాబాద్ లో పేదలకు శాశ్వత ఇళ్లు కట్టించిన నేత కాకా అని కొనియాడారు.  తాను ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకు  కాకాతో ప్రత్యేక అనుభందం ఉందన్నారు.  కాంగ్రెస్ పార్టీ కాకాకు  సరైన  గుర్తింపు ఇవ్వలేదని..  కాకా రాష్ట్రపతి కావాల్సి ఉండేదని కానీ  కాంగ్రెస్ పార్టీ ఆయనకు సరైన  గుర్తింపు ఇవ్వలేదన్నారు.  కాకా ఆశయ సాధన కోసం మనం పని చేయాలని సూచించారు.  కాకా అడుగు జాడల్లో వివేక్ వెంకట స్వామి పని చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.