ఇవాళ రాత్రి 4 వ విడత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. ఈ నెల 12, లేదా 13 న మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు. 9 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు కిషన్ రెడ్డి.
ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. విపక్షాలను, ప్రజా సంఘాల ఆందోళనలను సీఎం అణిచివేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని ఆరోపించారు. కేసీఆర్ నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఫైరయ్యారు. కేంద్రం నిధులతో తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చేశామన్నారు కిషన్ రెడ్డి
ALSO READ : తెలంగాణలో కాంగ్రెస్ కు 70 పైగా సీట్లు ఖాయం : పొంగులేటి