
తెలంగాణకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు టిటిడి బోర్డుకు అల్టిమేటమ్ జారీ చేశారు. తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బిజేపి ఎంపి రఘునందన్ రావు తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతనిథుల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారంటూ.. .. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, అకామిడేషన్ ఇచ్చేవాళ్ళుని తెలిపారు.
ALSO READ | తిరుమలలో దొంగల ముఠా అరెస్ట్
రాష్ట్ర విభజన తరువాత.. ఆంద్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిథుల లేఖల సిఫారస్ విషయంలో టీటీడీ బోర్డు వెంటనే ఆలోచన చేయలని పార్టీలకతీతంగా డిమాండ్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందనరావు అన్నారు. ఈవిషయంలో టీటీడీ సానుకూలంగానిర్ణయం తీసుకోకపోతే అందరం వచ్చి టీటీడీ.. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.