జోష్ మీదున్న బీజేపీ.. రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సమావేశాలు

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది తెలంగాణ బీజేపీ. ప్రధాని మోదీ వరుస పర్యటనలో మంచి జోష్ మీదున్న నేతలు..కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపేందుకు వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు.  అక్టోబర్ 6న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, 10న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మరోవైపు అక్టోబర్ 5, 6 తేదీల్లో  రెండు రోజలు పాటు జరిగే రాష్ట్ర సంస్థగత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలకు వెయ్యి మందికి పైగా నేతలు హాజరుకానున్నారు. 

అక్టోబర్ 5న  తొలి రోజు సమావేశంలో సునీల్ బన్సల్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్​చార్జులు, రాష్ట్ర పదాధికారుల భేటీ ఉంటుంది. 6న  జరిగే సమావేశాల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా  పాల్గొని.. నేతలు, కార్యకర్తలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.ఇందులో అన్ని అసెంబ్లీ స్థానాల కన్వీనర్లు, ఇన్​చార్జులు సహా దాదాపు 800 మంది పాల్గొంటారని వెల్లడించారు.