
హైదరాబాద్, వెలుగు: ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, బ్లాగర్లు, ఎంటర్‌ప్రెన్యూర్లు, ఫిల్మ్, మ్యూజిక్, టెలివిజన్, ఆర్ట్స్, లైఫ్‌స్టైల్ వంటి తదితర రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్నవారిని తెలంగాణ బ్లాగర్స్ తెలంగాణ ఐకాన్ అవార్డులతో సత్కరించింది. ఈ ఈవెంట్‌కు ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. తెలంగాణ ఐకాన్ అవార్డులు ప్రతిభను గుర్తించడానికి మాత్రమే కాదని, వినోద పరిశ్రమను ఒకచోట చేర్చే వేదికని తెలంగాణ బ్లాగర్స్ కమ్యూనిటీ వ్యవస్థాపకుడు అబ్దుల్ ముయిద్ అన్నారు. ఇది సృజనాత్మకతకు ఇచ్చే గౌరవమన్నారు.