అమెరికా అమ్మాయితో నిజామాబాద్ కుర్రాడి ప్రేమ పెళ్లి

అమెరికా అమ్మాయితో నిజామాబాద్ కుర్రాడి పెళ్లి ఘనంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా మాట్లూరికి చెందిన సొసైటీ మాజీ  ఛైర్మన్ మల్లయ్యగారి రమణారావు కుమారుడు వినీష్ రావు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ దేశానికి చెందిన డాక్టర్ డిజెర్ లూనాను ప్రేమించాడు. వీరి ప్రేమకు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రలు ఒప్పుకోవడంతో  నిజామాబాద్ లో  పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి  జిల్లా జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, మహిళా  కార్పొరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత   హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తనకు భారత సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని పెళ్లి కూతురు డిజెర్ లూనా అన్నారు. తన సంస్కృతి ఇష్టమని చెప్పింది.  ఇక భారతీయ సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయి తల్లిదండ్రులు  పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.