సోషల్​ వెల్ఫేర్​ కాలేజీల్లో అగ్రి బీఎస్సీ

సోషల్​ వెల్ఫేర్​ కాలేజీల్లో అగ్రి బీఎస్సీ

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహించే సిద్దిపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్‌‌‌‌ కాలేజీలో 2023–-24 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం బీఎస్సీ(ఆనర్స్‌‌‌‌) అగ్రికల్చర్‌‌‌‌ కోర్సులో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​ విడుదలైంది.

అర్హతలు: ఇంటర్మీడియట్ (బైపీసీ) లేదా డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్) ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. ఎంసెట్‌‌‌‌ 2023 లేదా అగ్రిసెట్‌‌‌‌ 2023 ర్యాంకు సాధించి ఉండాలి. వయసు17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​: ఎంసెట్‌‌‌‌ 2023 లేదా అగ్రిసెట్‌‌‌‌ 2023 ర్యాంకు, రూల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.  ఆగస్టు 25 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు  www.tswreis.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.