- కేంద్రం నుంచి 60వేల కోట్లు
- అప్పులు రూ.59,632
హైదరాబాద్, వెలుగు: రానున్న ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.60 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర సర్కార్ అంచనా వేసింది. సొంత ఆదాయం పెరుగుతోందని చెబుతూ, పోయినసారి కంటే ఈసారి రూ.26 వేల కోట్లు అదనంగా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. మొత్తంగా ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కలిపి రూ.1,33,634 కోట్ల సొంత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. సేల్స్ టాక్స్‌తో రూ.33 వేల కోట్లు, ఎక్సైజ్ రాబడి రూ.17,500 కోట్లు వస్తుందని అంచనా వేసింది. సేల్స్ ట్యాక్స్ లో ఎక్సైజ్ వ్యాట్ రూ.19,720 కోట్లు వస్తాయని లెక్కగట్టింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లతో రూ.15,600 కోట్లు వస్తాయని పేర్కొంది. జీఎస్టీతో రూ.36,203 కోట్లు రాబడి వస్తుందని లెక్కగట్టింది. నిరుటికంటే రూ.5 వేల కోట్లు ఎక్కువ. కాగా, రూ.59,632 కోట్లు అప్పులు తేనున్నట్లు పేర్కొంది.
త్వరలో మైనింగ్పాలసీ!
రాష్ట్రంలో మైనింగ్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతేడాది రూ.4 వేల కోట్లు ఉన్న రాబడిని ఈసారి రూ.6,399 కోట్లకు పెంచింది. భూముల అమ్మకం, ఇతరత్రా నాన్ట్యాక్స్ఆదాయం మొత్తంగా రూ.25,422 కోట్లుగా పేర్కొంది. ఇక సెంట్రల్ స్పాన్సర్డ్స్కీమ్ ల కింద రూ.9,443 కోట్లు, ఫైనాన్స్ కమిషన్, జీఎస్టీ కాంపన్సేషన్ కింద రూ.3 వేల కోట్లు వస్తాయని లెక్కగట్టింది.