తెలంగాణ బడ్జెట్ 2024: GHMC, HMDAకు రూ.3,565 కోట్లు కేటాయింపు

తెలంగాణ బడ్జెట్ 2024: GHMC, HMDAకు రూ.3,565 కోట్లు కేటాయింపు

హైదరాబాద్ పరిధిలో మౌలిక వసతుల రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం. HMDA కు రూ. 500 కోట్లు,  GHMC అభివృద్ధి కోసం రూ. 3 వేల 65  కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ నిధులను పూర్తి స్థాయిలో ఆయా సంస్థల అభివృద్ధి కోసమే వాడతామన్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరం హైదరాబాద్ నగర సుందరీకరణకు, మౌలిక వసతుల రూపకల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఈ నిధులతో బ్రాండ్ హైదరాబాద్ పేరును నిలబెడతామని.. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్ ను నిలుపుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.