తెలంగాణ బడ్జెట్ 2024: హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట.. రూ.10 వేల కోట్లు కేటాయింపు

తెలంగాణ బడ్జెట్ 2024: హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట.. రూ.10 వేల కోట్లు కేటాయింపు

హైదరాబాద్ మహా‌నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది.  ఇందులో భాగంగా మ2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటెన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరమని అన్నారు. 

ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్‌గా గుర్తింపు పొందిందని.. ఈ నేపథ్యంలో ఈ బడ్టెట్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో మెట్రో వాటర్ వర్క్స్, ఔటర్ రింగ్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన వంటివి ఉన్నాయి. అంతే కాకుండా  జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా3,065 కోట్లు , హెచ్‌ఎండీలో మౌలిక వసతులకు మరో 500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రపంచ స్థాయిలో హైదారాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు సర్కార్ నడుం బింగించిందన్నారు భట్టి విక్రమార్క.